పాలకోడేటి... ఎంత అందమైన ఇంటి పేరు!! ఎవరికైనా తమ ఇంటిపేరు అందంగానే కనబడవచ్చు. మన ఇంటిపేరైన ‘పాలకోడేటి పేరుమాత్రం నిజంగానే అందమైనదే. ఆ మాట మీరూ ఒప్పుకుంటారు.. ఎందుకంటే, ‘పాలకోడేటి’ ఇంటిపేరు ఒకటే అయినా, దానిలో మూడు పదాలు ఉన్నాయి, దానికి రెండు అర్థాలూ ఉన్నాయి. రెండూ అందమైన అర్థాలే!!

మన ఇంటిపేరులో మొదటి పదం ‘పాలు’, రెండోది ‘కోడు’, మూడోది ‘ఏరు’ . వీటిలో ‘కోడు’, ‘ఏరు’ అనే రెండు పదాలకూ మళ్లీ ఒకటే అర్థం ` ప్రవహించేది అని. అయితే, అది నది కాదు, కాలువ మాత్రమే. ‘పాలకోడేరు’ అంటే ‘పాలు ప్రవహించే కాలువ’ అని అర్థం.

» more
Slideshow Image Script