Bhimavaram Palakodety

భీమవరంకు సమీపంలోని గరగపర్రులో డా.పాలకోడేటి సత్యనారాయణశర్మ గారు ఉండేవారని తెలిసింది. వీరు భారత స్వాతంత్య్ర సమరకాలంలో మహత్మాగాంధీ పిలుపుమీద క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గ్గొని జైలుశిక్ష అనుభవించారనీ, అలాగే ఉప్పు సత్యాగ్రహం రోజుల్లో భీమవరం కేంద్రంగా ఉద్యమించిన శ్రీ పుచ్చలపల్లి సుందరయ్యగారి నేతృత్వంలో శ్రీ పాలకోడేటి వీర్రాజుగారు అక్కడ స్వచ్ఛంద సేవకులుగా ఉండేవారనీ ప్రముఖ స్వాతంత్రయోధులు శ్రీ పండ్రంగి రాజేశ్వరరావు ఒక వ్యాసంలో పేర్కొన్నారు. (పశ్చిమగోదావరి జిల్లా సమాచారదర్శిని, విశాలాంధ్ర దినపత్రిక, పశ్చిమగోదావరి జిల్లా ప్రత్యేక అనుబంధం, 1991 ఫిబ్రవరి, పేజీ 265)