Chityala Palakodety

చిట్యాల పాలకోడేటి వారి గురించి రెండు వంశచరిత్రలు ఉన్నాయి. మొదటిది 1980నాటిది కాగా, రెండోది 1994నాటిది. 1994 నాటి పుస్తకం Palakodety Vamsa Charithra పేరుతో ఉంది. చిట్యాల పాలకోడేటి వారి వంశచరిత్ర శ్రీ వియ్యన్నగారితో ఆరంభం అవుతోంది. వియ్యన్నగారు కిర్లంపూడి ఎస్టేట్‌లోని చిట్యాల ఠానేదార్‌గా పనిచేసేవారు. వారితో ఆరంభం అయిన ఆ వంశం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది.