Devarapalli Palakodety

దేవరపల్లి పాలకోడేటి వారికి చెందిన వంశ చరిత్రను డా.పాలకోడేటి సత్యనారాయణ రావు ‘పాలకోడేటి వంశవైభవం’ పేరుతో గ్రంథస్థం చేశారు. ఈ పుస్తకం 2011 ఆగస్టు 14న విడుదల అయింది. దానిలో లభిస్తున్న వివరాల ప్రకారం దేవరపల్లి వారి చరిత్ర శ్రీ శరభరాజుగారితో ఆరంభం అవుతోంది. ఈ పుస్తకంలోని కొన్ని ప్రాథమిక అంశాలు, ఇతర ప్రాంతాలలోని పాలకోడేటివారికీ ఉపయుక్తంగా ఉండటం విశేషం.