Gollalakoderu Palakodety

భీమవరానికి దగ్గరలో, పాలకోడేరు గ్రామానికి చేరువలోనే ఉన్న గొల్లలకోడేరు గ్రామంలో పాలకోడేటి వారి ఒక శాఖ ఉన్నట్లు మనకు ‘క్రీ.శే. క్రొవ్విడి వెంకట్రావు గారి బంధుసాగరం’ అనే పుస్తకంలో అభిస్తున్నాయి. ఈ పుస్తకసంకలనకర్త శ్రీ క్రొవ్విడి ప్రభాకర శ్రీరామమోహన్‌ రావు. ఈ పుస్తకం 2004సెప్టెంబర్‌ 5న విడుదల ప్రచురితం అయింది. ఈ పుస్తకంలో గొల్లలకోడేరు పాలకోడేటివారి గురించిన వివరాలు 22, 25వ పేజీలలో లభిస్తున్నాయి.

పాలకోడేటి వారిలో ఎందరో మహానుభావులు, ఎందరో ప్రముఖులు.. వారిది పాలకోడేరే కావచ్చు, రాజమండ్రి కావచ్చు, కాకినాడ కావచ్చు, విశాఖపట్నం, మద్రాస్‌.... దేవరపల్లి కావచ్చు..ఏదైతేనేం ఒక్కొక్కరి కథా ఒక్కొక్క కొత్త కోణాన్ని మనముందు ఆవిష్కరిస్తుంది. అందుకే ఎక్కడివారైనా ఎందరో పాలకోడేటివారిని గౌరవంగా, ఆత్మీయంగా తలుచుకుందాం.. ఎన్నెన్నో వైవిధ్యమైన రంగాలలో పాలకోడేటి వారు ఇంతగా తమ ప్రతిభా వ్యుత్పత్తులను ప్రకటించడం ఎవరినైనా ఆశ్చర్యంలో ముంచెత్తడం ఖాయం.

అసలు, పాలకోడేటి వంశంలోని వారి గురించి ఎంత చెప్పినా ఆ విశేషాలు సశేషమే.