Palakodety Family

పాలకోడేటి... ఎంత అందమైన ఇంటి పేరు!! ఎవరికైనా తమ ఇంటిపేరు అందంగానే కనబడవచ్చు. మన ఇంటిపేరైన ‘పాలకోడేటి పేరుమాత్రం నిజంగానే అందమైనదే. ఆ మాట మీరూ ఒప్పుకుంటారు.. ఎందుకంటే, ‘పాలకోడేటి’ ఇంటిపేరు ఒకటే అయినా, దానిలో మూడు పదాలు ఉన్నాయి, దానికి రెండు అర్థాలూ ఉన్నాయి. రెండూ అందమైన అర్థాలే!!

మన ఇంటిపేరులో మొదటి పదం ‘పాలు’, రెండోది ‘కోడు’, మూడోది ‘ఏరు’ . వీటిలో ‘కోడు’, ‘ఏరు’ అనే రెండు పదాలకూ మళ్లీ ఒకటే అర్థం ` ప్రవహించేది అని. అయితే, అది నది కాదు, కాలువ మాత్రమే. ‘పాలకోడేరు’ అంటే ‘పాలు ప్రవహించే కాలువ’ అని అర్థం.

‘కోడు’ అంటే మరో అర్థం ‘ఊతంగా నిలిచే (మంచం) కోడు’. అలాగే ‘ఏరు’ అంటే మరో అర్థం ‘నాగలి’ అని. ఇలా చూస్తే, ‘పాలకోడేరు’ అంటే ‘పాలతో రూపొందిన నాగలి’ అని అర్థం. పాలనాగలితో పొలం దున్నితే, అక్కడ పంటలు ఎంత అమృతమయంగా, రుచికరంగా, ఆయుష్‌ప్రదాయకంగా ఉంటాయో వేరే చెప్పటం అనవసరం.

ఎలా చూసినా, ఏ అర్థం గ్రహించినా, ‘పాలకోడేటి’ వారు అదృష్టవంతులన్నది సత్యం.

మరో విశేషం ` ‘పాలకోడేటి’గా మన ఇంటిపేరును ఏనాడో మన పూర్వికులు స్థిరపరిచినప్పుడు నిత్యం ప్రవహించే ‘పాల కాలువ’ (క్షీర ధార) లాగే మన ‘పాలకోడేటి’ వారి వంశం సైతం నిర్మలంగా, స్వచ్ఛంగా, అనంతంగా, పుష్కలంగా కొనసాగుతుండాలనే ఆకాంక్ష, ఆశంసకూడా ఉండి ఉంటుందన్నదీ వాస్తవం కావచ్చు!!

పాలకోడేటి వంశ సంజాతులు

ఏనాడు ఎక్కడ ఆవిర్భవించి ఎన్నెన్ని శాఖోపశాఖలుగా విస్తరిస్తూ వచ్చిందో స్పష్టంగా చెప్పటం కష్టం కానీ, పాలకోడేటి వంశం బహు విస్తృతంగా వ్యాపి ్తచెందింది.

పాలకోడేటి వారు ప్రధానంగా పశ్చిమగోదావరి జిల్లాలోని దేవరపల్లిలో, చిట్యాలలోనూ, తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలోనూ, అటు విశాఖపట్నంలోనూ ఉన్నారు. మద్రాసులోనూ పాలకోడేటివారు ఉన్నారనేది మరొక వార్త.

ప్రస్తుతం పాలకోడేటి వారు ఎక్కడెక్కడ వున్నా, వారి మూలాలన్నీ బహుశా పాలకోడేరు గ్రామం నుంచే అయి వుండవచ్చు. ఈ ప్రాంతం నుంచే ఈ వంశస్థులు అనేక వ్యాపకాలమీద, అనేక వృత్తి, ఉద్యోగపరమైన ఇతర కారణాల వల్ల పలు ప్రాంతాలకు వలసలు వెళ్లారు. వెళ్తున్నారు. ఒకప్పుడు కేవలం జిల్లాలో మరో ప్రాంతానికీ, రాష్ట్రంలో మరో ప్రాంతానికీ సాగిన ఈ వలసలు ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్‌ వంటి అనేక విదేశాలకు విస్తరిస్తున్నాయి. ఏ కారణాన ఎక్కడికి వెళ్ళినా, ఎప్పుడు ఎక్కడ వున్నా, పాలకోడేటివారు తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు, తమ ప్రత్యేకతలను నిలుపుకుంటున్నారు.

ఒక మర్రిచెట్టు ఊడలు చాచి, తన పరిధిని పెంచుకున్నట్లుగానే పాలకోడేటివారు ప్రాథమికంగా ఒకే వంశవృక్ష శాఖలయినా పలు కారణాల వల్ల చాలాకాలం క్రితమే వేర్వేరుచోట్లకు వెళ్లి, స్ధిరపడిన దృష్టాంతాలున్నాయి. కాలక్రమేణా, వీరిమధ్య సంబంధాలు తగ్గిపోయాయి. పైగా గతంలో ఉన్న సామాజిక కట్టుబాట్లు వల్ల పురుళ్లు, పుణ్యాలను ఉమ్మడిగా పాటించడం కూడా కష్టమవుతూ వచ్చింది. అందుకే సమీప బాంధవ్యాలకు ఎక్కడో ఒకచోట పుల్‌స్టాప్‌ పెట్టాల్సిన అవసరం ఏర్పడిరది. ఫలితంగా ఇప్పుడు పైన పేర్కొన్న విశాఖపట్నానికి చెందిన పాలకోడేటివారికి, దేవరపల్లికి చెందిన పాలకోడేటి వారికి, చిట్యాలకు చెందిన పాలకోడేటి వారికి, రాజమండ్రి పాలకోడేటివారికి, .. ఇలాగే ఇతర ప్రాంతాలలో ఉన్న పాలకోడేటి వారికి సంబంధ బాంధవ్యాలు ఉన్నట్లు లేవు. అందరూ పాలకోడేటి వారైనా ఒకరి వివరాలు మరొకరికి అందడంలేదు. ఎవరికి వారే పలు ప్రాంతాలలో పాలకోడేటివారుగా కాలం గడుపుతున్నారు.