Rajam Palakodety

శ్రీకాకుళం జిల్లాలోని రాజాంనుంచి మరో పాలకోడేటివారి శాఖ వర్ధిల్లుతోంది. ఈ శాఖ శ్రీ శరభరాజుగారితో ఆరంభం అవుతోంది. దేవరపల్లి వారి శాఖ కూడా శ్రీ శరభరాజుగారితోనే ఆరంభం కావటం గమనిస్తే, మన పూర్వికులైన అన్ని శాఖలోనూ ఎవరో ఒక శరభరాజు గారు ఉన్నారనేది స్పష్టం. ఆయననుంచే వంశం క్రమాభివృద్ధి చెందిదన్నది గమనించవచ్చు. కొంచెం పరిశోధన చేయగలిగితే, అందరు పాలకోడేటివారూ ఒకే కొమ్మ పూలు అన్నదీ నిరూపించుకోవచ్చు.

పాలకోడేటి వారిలో ఎందరో మహానుభావులు, ఎందరో ప్రముఖులు.. వారిది పాలకోడేరే కావచ్చు, రాజమండ్రి కావచ్చు, కాకినాడ కావచ్చు, విశాఖపట్నం, మద్రాస్‌.... దేవరపల్లి కావచ్చు..ఏదైతేనేం ఒక్కొక్కరి కథా ఒక్కొక్క కొత్త కోణాన్ని మనముందు ఆవిష్కరిస్తుంది. అందుకే ఎక్కడివారైనా ఎందరో పాలకోడేటివారిని గౌరవంగా, ఆత్మీయంగా తలుచుకుందాం.. ఎన్నెన్నో వైవిధ్యమైన రంగాలలో పాలకోడేటి వారు ఇంతగా తమ ప్రతిభా వ్యుత్పత్తులను ప్రకటించడం ఎవరినైనా ఆశ్చర్యంలో ముంచెత్తడం ఖాయం.

అసలు, పాలకోడేటి వంశంలోని వారి గురించి ఎంత చెప్పినా ఆ విశేషాలు సశేషమే.